News August 18, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నాగావళి, వంశధార
➤ భారీ వర్షాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
➤ ఎడతెరిపి లేని వానలకు జిల్లాలో పలు చోట్ల నీట మునిగిన పంటలు
➤ శ్రీకాకుళం: కేజీబీవీ ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం
➤రైతుల సమస్యలు పట్టవా: తిలక్
➤పలాసలో జలమయమైన రోడ్లు
➤ అధ్వానంగా కె కొత్తూరు సర్వీస్ రోడ్డు
➤మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: కలెక్టర్
➤ సంతబొమ్మాళి: వర్షాలతో నౌపాడ ఉప్పునకు ముప్పు
Similar News
News August 19, 2025
SKLM: కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ పర్యవేక్షణ

శ్రీకాకుళం జిల్లాలోని మండల స్పెషల్ ఆఫీసర్స్‌తో నేరుగా ఫోన్‌లో కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ మాట్లాడారు. లోతట్టు ప్రాంతలు ప్రజలను అప్రమత్తం చేయాలని వారికి సూచించారు. ఇవాళ రాత్రి అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి సచివాలయంలో ఇద్దరు డ్యూటీలో ఉండాలని, పాటపట్నం,మెళియాపుట్టి, కంచిలి ప్రాంతాల్లో పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కంట్రోల్ రూమ్ డ్యూటీలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 18, 2025
SKLM: అధికారులతో సమీక్షించిన కలెక్టర్

జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్ సోమవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు, భవనాళ శాఖ, పంచాయతీరాజ్, ఫైర్ విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు. అల్పపీడనం కొనసాగుతున్నందున ఎక్కడ నిర్లక్ష్యం వహించరాదని తెలియజేశారు.
News August 18, 2025
SKLM: ఎస్సీ గ్రీవెన్స్‌కు 43 వినతులు

శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు 43 వినతులు ఎస్పీకి సమర్పించారు. నిర్లక్ష్యం వహించకుండా, త్వరితగతిన ఆయా ఫిర్యాదులపై విచారణ జరిపి, అర్జీదారులు సంతృప్తి పొందేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. జూమ్ ద్వారా ఆయా పోలీస్ అధికారులతో మాట్లాడారు. న్యాయపరమైన చట్టపరమైన అంశాలను పరిశీలించాలన్నారు.