News April 1, 2024

చింతలపూడి మార్కెట్ వెనుక డెడ్‌బాడీ లభ్యం

image

ఏలూరు జిల్లాలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చింతలపూడి మార్కెట్ యార్డ్ వెనుక రమేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఆయన మృతి చెంది వారం రోజులు అయినట్లు కుటుంబీకులు అభిప్రాయపడుతున్నారు. రమేశ్ చింతలపూడి జీబీజీ రోడ్‌లో సెలూన్ షాప్ నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 14, 2026

పశ్చిమగోదావరిలో మార్చి 16 నుంచి ఒంటిపూట బళ్లు

image

ఎండల తీవ్రత దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లాలో మార్చి 16 సోమవారం నుంచి ఒంటిపూట బళ్లు నిర్వహించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయని తెలిపారు. ఎండల నుంచి విద్యార్థులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

News March 14, 2026

ప.గో: గ్యాస్ కష్టాలు.. బ్లాక్‌లో సిలిండర్ రూ.1800

image

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ధరల మోతతో పాటు సర్వర్ల మొరాయింపుతో ఇబ్బందులు పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బుకింగ్ కోసం అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సి వస్తోందని, ఓటీపీ వస్తేనే ఏజెన్సీలు సిలిండర్లు ఇస్తున్నాయని వాపోతున్నారు. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ లో రూ.1400 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అధికారులు స్పందించి అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

News March 13, 2026

ప.గో : వైసీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులను నియమించింది. శుక్రవారం రాత్రి ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నియామక ఉత్తర్వులను జారీ చేసింది. యడ్ల తాతాజీ (ఆచంట), పేరిచర్ల విజయ నరసింహారాజు (పాలకొల్లు), ముప్పిడి సంపత్ కుమార్ (నర్సాపురం) ఫొటో, కొట్టు నాగేంద్ర (తణుకు) ఫొటో, వేండ్ర వెంకటస్వామి (తాడేపల్లిగూడెం), ఏఎస్. రాజు (ఉండి) నియమితులయ్యారు.