News August 19, 2025

PDPL: కష్టపడి శ్రమిస్తేనే లక్ష్యాల చేరిక: DCP

image

రామగిరి మం. JNTU ఇంజినీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేశోరాం ప్లాంట్ అధిపతి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా, PDPL DCP కరుణాకర్, ACP రమేష్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు బాధ్యతతో చదువుకుని నైపుణ్యాలు పెంపొందించుకోవాలని శ్రీనివాసరెడ్డి సూచించగా, DCP కరుణాకర్ కష్టపడి శ్రమిస్తేనే లక్ష్యాలు చేరుకోగలరన్నారు. క్రీడల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.

Similar News

News August 24, 2025

DSCలో 3 ఉద్యోగాలు సాధించిన రేవతి

image

ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లెకు చెందిన వీరప్ప-లింగమ్మ కుమార్తె రేవతి డీఎస్సీలో 3 ఉద్యోగాలు సాధించింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రేవతి 9వ ర్యాంక్‌తో స్కూల్ అసిస్టెంట్, 6వ ర్యాంక్‌తో PGT, TGT పోస్టులకు అర్హత సాధించింది. తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని రేవతి అన్నారు.

News August 24, 2025

ఇక జిల్లాల్లోనే క్యాన్సర్ చికిత్స!

image

TG: క్యాన్సర్ మహమ్మారి చికిత్స కోసం HYDకు రాకుండా జిల్లాల్లోనే వైద్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బోధనాస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. తక్షణమే 34 మెడికల్ కాలేజీల్లో 20 పడకల(10 కీమో, 10 పాలియేటివ్ కేర్) చొప్పున కేటాయించనుంది. ఇప్పటికే 27 సెంటర్లకు కేంద్రం రూ.40.23 కోట్లు నిధులు ఇవ్వగా మరో ఏడింటిని రాష్ట్ర నిధులతో సమకూర్చనున్నారు.

News August 24, 2025

మధ్యాహ్నం నిద్రపోతున్నారా: చాణక్య నీతి

image

మధ్యాహ్నం నిద్ర మేలు కాదని చాణక్య నీతి చెబుతోంది. దీంతో ఇతరుల కంటే పని తక్కువగా చేయడమే కాకుండా సమయం వృథా అవుతుంది. డబ్బు నష్టపోయే అవకాశముంది. జబ్బు చేసిన వారు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు మాత్రమే నిద్ర పోవాలని అంటోంది. మధ్యాహ్నం నిద్రతో జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు కూడా చెబుతున్నారు. పవర్ న్యాప్(10-15 నిమిషాల నిద్ర)కు ఇది మినహాయింపు.
<<-se>>#chanakyaneeti<<>>