News August 19, 2025
ADB ఎస్పీకి విద్యార్థిని స్పెషల్ గిఫ్ట్

యువత అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్‌కు చెందిన బద్దం మేఘనారెడ్డి పెన్సిల్ చార్కోల్ ఆర్ట్ ద్వారా ఎస్పీ చిత్రాన్ని అద్భుతంగా గీశారు. ఈ మేరకు సోమవారం ఎస్పీని స్థానిక డీపీఓ కార్యాలయంలో కలిసి చిత్రాన్ని ఆమె బహూకరించారు. చిత్రాన్ని చూసి విద్యార్థిని ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Similar News
News August 24, 2025
తాంసిలో వైభవంగా ఎద్దుల జాతర.. హాజరైన కలెక్టర్, ఎస్పీ

తాంసి మండల కేంద్రంలో పొలాల అమావాస్యను పురస్కరించుకొని శనివారం ఎద్దుల జాతర వైభవంగా జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులు కలిసి బసవన్నకు ప్రత్యేక పూజలు చేసి, గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
News August 23, 2025
ఆదిలాబాద్: డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చందుకు స్పెషల్ డ్రైవ్స్

ఆదిలాబాద్ జిల్లాను డ్రగ్ ఫ్రీగా మార్చే లక్ష్యంతో పోలీసులు మాదకద్రవ్యాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, పలు కాలనీలు, దుకాణాల్లో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ రోమా సహాయంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి సాగు చేసేవారు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా పరిగణిస్తారని పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News August 22, 2025
ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజ్

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ గురువారం రాత్రి పర్యటించారు. ఆమె పర్యటనలను గోప్యంగా ఉంచారు. పట్టణంలోని టీటీడీసీలో ఆమె బస చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలసి మీనాక్షి నటరాజన్ శ్రమదానం చేశారు. అనంతరం నాయకులతో మాట్లాడి జిల్లా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, ఆత్రం సుగుణ, ఆడే గజేందర్ పాల్గొన్నారు.