News August 19, 2025
మహిళలకు ఫ్రీ బస్.. సీఎం మరో గుడ్‌న్యూస్

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ జిరాక్స్‌తో పాటు సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘స్త్రీశక్తి’ పథకంపై సమీక్ష నిర్వహించారు. సోమవారం ఒక్కరోజే 18 లక్షల మందికిపైగా మహిళలు జీరో ఫేర్ టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్లు అధికారులు ఆయన తెలిపారు. దీంతో వారికి రూ.7 కోట్లకు పైగా ఆదా అయిందన్నారు. అటు ఘాట్ రోడ్లలోనూ పథకం అమలు చేయాలని సీఎం సూచించారు.
Similar News
News August 24, 2025
పవన్ కళ్యాణ్ OG నుంచి అప్‌డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనుంది. ‘తుఫాన్ ఆగిపోయింది.. ఇప్పుడు గాలి వీస్తోంది’ అంటూ సెకండ్ సింగిల్‌పై అంచనాలు పెంచేసింది. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా, DVV దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.
News August 24, 2025
ఇవాళ, రేపు వెబ్ ఆప్షన్లకు అవకాశం

TG: డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్ ఫేజ్-2 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24, 25న వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా ఒక కాలేజీలో సీటు పొందిన విద్యార్థి, అదే కాలేజీలో మరో బ్రాంచిలో సీటు ఖాళీగా ఉంటే మార్చుకోవచ్చు. మరో కాలేజీలో అలాంటి అవకాశం ఉండదు.
News August 24, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సంచలన విషయాలు

HYDలో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్యను చంపి <<17500952>>ముక్కలుగా చేసిన<<>> ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. నిన్న భార్యను చంపి రంపంతో ముక్కలుగా చేసినట్లు పోలీసులు గుర్తించారు. తల, కాళ్లు, చేతులను మూసీలో పడేశానని.. ఛాతి భాగం తీసుకెళ్లలేకపోయానని మహేందర్ చెప్పాడు. పడేసిన అవయవాల కోసం నదిలో గాలిస్తున్నారు.