News August 19, 2025
జనగామలో 1273 మెట్రిక్ టన్నుల యూరియా

జిల్లా వ్యాప్తంగా 1273.935 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ నిల్వ ఉందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. బచ్చన్నపేట 10.516, చిల్పూర్ 82.29, దేవరుప్పుల 181.335, ఘన్‌పూర్ స్టేషన్ 172.545, జనగామ 155.32, కొడకండ్ల 56.745, లింగాల ఘన్‌పూర్ 99.375, నర్మెట్ట 74.295, పాలకుర్తి 80.405, రఘునాథ్‌పల్లి 192.457, తరిగొప్పుల 21.51, జఫర్‌గఢ్ 69.93 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News August 24, 2025
కరపలో కేజీ చికెన్ రూ.200

కరప మండలంలో చికెన్ ధరలు పెరిగాయి. కేజీ లైవ్ చికెన్ రూ. 140, మాంసం రూ.180, స్కిన్‌లెస్ రూ.200 కి విక్రయిస్తున్నారు. ధరలు పెరిగినప్పటికీ షాపుల వద్ద కొనుగోలుదారులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయగలరు.
News August 24, 2025
సంగారెడ్డి: ఎస్జీటీ పదోన్నతుల జాబితా విడుదల

ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందే ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. 190 మందికి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి వచ్చినట్లు పేర్కొన్నారు. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు సోమవారం వెబ్ ఆప్షన్ ద్వారా పాఠశాలను ఎంచుకోవాలని చెప్పారు. కేటాయించిన పాఠశాలలో 26న విధుల్లో చేరాలని సూచించారు.
News August 24, 2025
ఒంగోలు: టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికో..?

ఒంగోలులో TDP సమావేశం ఆదివారం జరగనుంది. ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడి ఎంపికపై త్రీ మెన్ కమిటీ ఆధ్వర్యంలో అభిప్రాయాలు సేకరించనుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. యువనేత దామచర్ల సత్యతో పాటు మరికొందరు రేసులో ఉన్నట్లు సమాచారం. ఎవరికి అధ్యక్ష పదవి వస్తుందని మీరు అనుకుంటున్నారు?