News August 19, 2025

దీపావళికి కార్లు, బైక్‌ల ధరల తగ్గింపు?

image

దీపావళికి కొత్త కార్లు, బైక్‌లు కొనే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. కొత్త తరం GST సంస్కరణలను అమలు చేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్‌లను రెండుకు తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 28 శాతం పన్ను స్లాబ్‌లో ఉన్న కార్లు, బైక్‌లు 18 శాతం పన్ను స్లాబ్‌లోకి వస్తాయని సమాచారం. తక్కువ ధరలు ఉన్న వాహనాల సేల్స్ పెరగొచ్చని అంచనా.

Similar News

News August 19, 2025

వన్డే WC వరకు రోహిత్ కెప్టెన్‌గా ఉండాలి: రాయుడు

image

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మే కెప్టెన్‌గా ఉండాలని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచకప్ ఎవరు గెలిపించగలరో చూడాలి. రోహిత్ సారథిగా ఉంటే అది సాధ్యం అవుతుంది. ఇందుకోసం అతడు 2027 వరకు రిటైర్మెంట్ ప్రకటించకూడదు. వన్డేల్లో రోహిత్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అతడి కెప్టెన్సీ, బ్యాటింగ్ అద్భుతంగా ఉంటాయి. ప్లేయర్లకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తాడు’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశంసించారు.

News August 19, 2025

16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్

image

AP: మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్ మార్కులపై అభ్యంతరాల స్వీకరణ, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన లిస్టు రావడంతో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో వెరిఫికేషన్‌కు పిలవనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

News August 19, 2025

నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. నేడు ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం.. తెలంగాణలోని ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. కామారెడ్డి(D) మద్నూర్, డోంగ్లీ మండలాలకూ సెలవు ప్రకటించారు. కాగా వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల CMలు ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.