News August 19, 2025

నేడే ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రకటన?

image

ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ ఇవాళ జట్టును ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నాయి. జట్టు సెలక్షన్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో జట్టు కూర్పుపై వారు మాట్లాడతారని సమాచారం. అలాగే పాకిస్థాన్‌తో జరిగే మ్యాచులపైనా స్పష్టత ఇచ్చే అవకాశముంది.

Similar News

News August 19, 2025

రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోతోంది: KTR

image

TG: కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ పెరిగిపోతోందని BRS నేత KTR అన్నారు. ‘వారంలోనే HYDలో 2 షాకింగ్ క్రైమ్స్ జరిగాయి. పట్టపగలే ఓ జువెలరీ షాప్‌లో చోరీ, కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలిక <<17444868>>హత్య<<>> ఘటనలు చోటుచేసుకున్నాయి. పబ్లిక్ సేఫ్టీ ప్రమాదంలో పడింది. ప్రజలకు రక్షణ కావాలి.. భయం కాదు. సమర్థులైన TG పోలీసులను లా & ఆర్డర్ కోసం కాకుండా రాజకీయ అవసరాలకు వాడుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది’ అని ఫైరయ్యారు.

News August 19, 2025

జగన్ దారి ఎటువైపు?

image

AP: ఓట్ల చోరీ, ఉపరాష్ట్రపతి ఎంపిక విషయాల్లో మాజీ సీఎం జగన్ ఇండీ కూటమికి దూరంగా ఉంటున్నారు. AP ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ.. రాహుల్ గాంధీతో కలిసి ఈసీపై పోరాడుతారా అనే ప్రశ్నకు ఇదివరకే జగన్ <<17390003>>నో<<>> చెప్పేశారు. రాహుల్, చంద్రబాబు, రేవంత్ ఒక్కటేనని ఆరోపించారు. తాజాగా NDA కూటమి బలపర్చిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి <<17448759>>మద్దతు<<>> తెలిపేందుకు ఓకే చెప్పారు. దీంతో జగన్ దారి ఎటువైపు అనే చర్చ మొదలైంది.

News August 19, 2025

ట్రైన్ టికెట్లు బుక్ అవుతున్నాయా?

image

IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్లు బుక్ అవ్వట్లేదని పలువురు SMలో పోస్ట్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి లాగిన్, బుకింగ్స్‌ సమస్య నెలకొందని చెబుతున్నారు. పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయని, ఎర్రర్ మెసేజెస్ వస్తున్నాయని రిపోర్ట్ చేస్తున్నారు. IRCTC డౌన్ అయిందని పలు ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్స్ కూడా వెల్లడించాయి. అయితే దీనిపై ఇప్పటివరకు సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. మీకూ ఈ సమస్య ఎదురైందా?