News August 19, 2025

శ్రీకాకుళం: నేడు స్కూల్స్‌కు సెలవు

image

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం రాత్రి అధికారకంగా వెల్లడించారు. వాతావరణ శాఖ సూచనలతో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Similar News

News August 19, 2025

శ్రీకాకుళం జిల్లాలో 1120.5 మి.మీ వర్షపాతం నమోదు

image

విస్తారంగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో, మంగళవారం ఉదయం 8.30 గంటలకు శ్రీకాకుళం జిల్లాలో 1120.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యధికంగా మెళియాపుట్టి మండలంలో 89.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, అతి తక్కువగా కంచిలి మండలంలో 4.8 మిల్లీమీటర్లు రికార్డు అయింది.

News August 19, 2025

శ్రీకాకుళం: నేడు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు

image

శ్రీకాకుళం జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు మంగళవారం కూడా అధికారులు సెలవును ప్రకటించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చిన్నారులకు సెలవును కొనసాగించినట్లు చెప్పారు. కాగా అంగన్వాడీ సిబ్బంది కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఐసీడీఎస్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. వర్షాలకు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తిన ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.

News August 19, 2025

శ్రీకాకుళం: దళారులను నమ్మి మోసపోవద్దు

image

జిల్లా కోర్టుల పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక పరీక్షల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా నిరుద్యోగులను హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కంప్యూటర్ ఆధారిత పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామన్నారు.