News August 19, 2025

16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్

image

AP: మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్ మార్కులపై అభ్యంతరాల స్వీకరణ, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన లిస్టు రావడంతో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో వెరిఫికేషన్‌కు పిలవనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Similar News

News August 19, 2025

చైనాలో తైవాన్‌ భాగమేనని భారత్ చెప్పిందా?

image

చైనాలో తైవాన్ భాగమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారని చైనా అధికారిక మీడియా Xinhua పేర్కొంది. నిన్న చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ‌తో భేటీలో ఈ మేరకు జైశంకర్ వ్యాఖ్యానించారని తెలిపింది. మరోవైపు తైవాన్ విషయంలో భారత స్టాండ్‌లో ఎలాంటి మార్పు లేదని, దౌత్య సంబంధాలు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై భారత్ అధికారికంగా ప్రకటిస్తేనే క్లారిటీ రానుంది.

News August 19, 2025

పద్మజ మరణంపై సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

image

నందమూరి జయకృష్ణ భార్య పద్మజ <<17450773>>మృతిపై<<>> ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. పద్మజ మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ఘటన తమ కుటుంబంలో విషాదం నింపిందని తెలిపారు. కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచిన అత్త ఆకస్మిక మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని లోకేశ్ పేర్కొన్నారు.

News August 19, 2025

తీరం దాటిన వాయుగుండం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తెల్లవారుజామున తీరం దాటినట్లు APSDMA తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, ఉత్తరాంధ్రలోని కృష్ణా, ఏలూరు, అల్లూరి, వైజాగ్, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.