News August 19, 2025
వన్డే WC వరకు రోహిత్ కెప్టెన్‌గా ఉండాలి: రాయుడు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మే కెప్టెన్‌గా ఉండాలని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచకప్ ఎవరు గెలిపించగలరో చూడాలి. రోహిత్ సారథిగా ఉంటే అది సాధ్యం అవుతుంది. ఇందుకోసం అతడు 2027 వరకు రిటైర్మెంట్ ప్రకటించకూడదు. వన్డేల్లో రోహిత్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అతడి కెప్టెన్సీ, బ్యాటింగ్ అద్భుతంగా ఉంటాయి. ప్లేయర్లకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తాడు’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశంసించారు.
Similar News
News August 19, 2025
ప్రభాస్ మూవీలను దాటేసిన చిన్న సినిమా

యానిమేషన్ వండర్ ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. హిందీలో ఈ మూవీ సాహో(రూ.150 కోట్లు), సలార్(రూ.153 కోట్లు) లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసింది. 25 రోజుల్లో రూ.160 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది. ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్లు దాటొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లకు చేరువైంది.
News August 19, 2025
రోహిత్, కోహ్లీ.. ప్రాక్టీస్ మొదలెట్టారు!

భారత స్టార్ క్రికెటర్స్ రోహిత్, విరాట్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో రోహిత్ జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫొటో వైరలవుతోంది. మరోవైపు విరాట్ లండన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఫ్యాన్‌తో దిగిన సెల్ఫీ SMలో హాట్ టాపిక్‌గా మారింది. ‘వరల్డ్ కప్ వేట మొదలైంది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ AUSతో OCT 19న స్టార్ట్ కానున్న ODI సిరీస్‌లో ఆడే అవకాశముంది.
News August 19, 2025
చైనాలో తైవాన్ భాగమేనని భారత్ చెప్పిందా?

చైనాలో తైవాన్ భాగమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారని చైనా అధికారిక మీడియా Xinhua పేర్కొంది. నిన్న చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీతో భేటీలో ఈ మేరకు జైశంకర్ వ్యాఖ్యానించారని తెలిపింది. మరోవైపు తైవాన్ విషయంలో భారత స్టాండ్‌లో ఎలాంటి మార్పు లేదని, దౌత్య సంబంధాలు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై భారత్ అధికారికంగా ప్రకటిస్తేనే క్లారిటీ రానుంది.