News August 19, 2025
రూ. వెయ్యి జరిమానా: కర్నూలు ట్రాఫిక్ సీఐ

కర్నూలులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే యజమానులకు జరిమానా విధిస్తున్నట్లు కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ వెల్లడించారు. సోమవారం సీఐ ట్రాఫిక్ పోలీసులతో కలిసి సి.క్యాంప్, బళ్లారి చౌరస్తా, రాజ్ విహార్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ఉన్న వాహనదారులకు రోజా పువ్వు ఇచ్చి, హెల్మెట్ లేని 100 మందికి రూ. 1000 చొప్పున జరిమానా విధించామన్నారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరని సూచించారు.
Similar News
News August 19, 2025
యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు: కలెక్టర్

రైతులకు కాకుండా యూరియాను పక్కదారి పట్టిస్తే వ్యవసాయ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ రంజిత్ భాషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో యూరియా ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ షాపుల్లో అధిక ధరలకు అమ్మినా, లింకేజీలు పెట్టినా కేసులు తప్పవన్నారు. సరిహద్దు చెక్ పోస్ట్‌లలో విజిలెన్స్, పోలీస్, రవాణాశాఖ అధికారుల టీములతో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
News August 19, 2025
తుంగభద్ర జలాశయం 26 గెట్లు ఎత్తివేత

ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల రైతులకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర జలాశయం వరుస వర్షాల కారణంగా మంగళవారం నిండుకుండలా మారింది. దీంతో బోర్డు అధికారులు జలాశయం నుంచి 26 గేట్లను ఎత్తి దిగువన గల నదికి నీటిని విడుదల చేశారు. దీంతో నది తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో ఉన్న నీటి సామర్థ్యం 1,626 అడుగులుగా ఉంది.
News August 19, 2025
మాదకద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

సమాజాన్ని నిర్వీర్యం చేసే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.రంజిత్ భాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ భవనంలో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో కలిసి “డ్రగ్స్ వద్దు బ్రో” పోస్టర్లను ఆవిష్కరించారు. జేడ్పీ సీఈఓ నాసర రెడ్డి, కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.