News August 19, 2025

సైనికుల చేతికి హైదరాబాద్ మెషీన్ గన్స్

image

TG: హైదరాబాద్‌కు చెందిన మరో తుపాకీ ఆర్మీ చేతికి అందనుంది. బాలానగర్‌లోని లోకేశ్ మెషీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ‘అష్మీ’ పేరుతో సబ్ మెషీన్ గన్ తయారు చేసింది. దీంతో ఆర్మీ రూ.17.7 కోట్ల విలువైన ఆర్డర్‌ను ఈ సంస్థకు ఇచ్చింది. ఇది 1,800 మీటర్ల రేంజ్‌ను ఛేదించగలదు. MMG కంటే 25 శాతం బరువు తక్కువగా ఉంటుంది. 250 తూటాల బెల్ట్ కెపాసిటీ దీని సొంతం. మైనస్ 40 నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఇది చక్కగా పనిచేస్తుంది.

Similar News

News August 19, 2025

మోదీ భజనలో బిజీగా కిషన్ రెడ్డి, బండి సంజయ్: రేవంత్

image

TG: రైతుల అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని CM రేవంత్ ఫైరయ్యారు. కేంద్రాన్ని ఎండగడుతూ పార్లమెంట్ ఆవరణలో TG కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపిన ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోదీ భజన చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తేవడం కోసం కలిసి రావాల్సిన BRS ఎంపీలు పత్తా లేరని దుయ్యబట్టారు.

News August 19, 2025

కాంగోలో మారణకాండ.. 52 మందిని నరికి చంపారు

image

కాంగోలో అల్లైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ADF) మారణకాండకు పాల్పడింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతున్న ఈ గ్రూప్ ఈనెల 9-16 మధ్య దాదాపు 52 మంది సివిలియన్లను కిరాతకంగా నరికి చంపినట్లు UN వెల్లడించింది. ADF మెంబర్స్ కొన్నేళ్లుగా కిడ్నాప్‌లు, చోరీలు, ఇళ్లు, వాహనాలు తగలబెట్టడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. వీరు ఉగాండా, కాంగో సరిహద్దుల్లో ఉంటూ నేరాలు చేస్తున్నారు. ADFపై US, UN ఇప్పటికే ఆంక్షలు విధించాయి.

News August 19, 2025

కొత్త మిస్ యూనివర్స్ ఇండియా ఎవరంటే?

image

మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీలో రాజస్థాన్‌కు చెందిన మనికా విశ్వకర్మ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా గతేడాది విజేత రియా సింఘా ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. దీంతో ఆమె మన దేశం తరపున 74వ యూనివర్స్ పోటీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న ఆమె పోటీలో తన అందం, ప్రతిభ, తెలివితేటలతో న్యాయమూర్తులను ఆకట్టుకుని విజయం సాధించారు. మొదటి రన్నరప్‌ తాన్య శర్మ(UP).