News August 19, 2025

ఉమ్మడి కడప: నవోదయ ప్రవేశాల డేట్స్ పొడిగింపు

image

ఉమ్మడి కడప జిల్లాలో నవోదయ ప్రవేశానికి ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాజంపేట మండలం నారంరాజుపల్లె జవహర్ కళాశాల ప్రిన్సిపల్ గంగాధరన్ మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని అన్నమయ్య, కడప జిల్లాల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News August 19, 2025

HYD: పీ.వీ.రమణ రంగస్థల పురస్కారాలు.. గ్రహీతలు వీళ్లే.!

image

2024,2025 సంవత్సరానికి పీ.వీ.రమణ జయంతి సందర్భంగా పీ.వీ.రమణ రంగస్థల పురస్కారాలు తెలుగు యూనివర్సిటీ ప్రదానం చెయ్యనుంది. 2024 సం.నికి ప్రముఖ రంగస్థల సంగీత దర్శకుడు టి.రాజబాబు, 2025 సం.నికి రంగస్థల నటి, దర్శకురాడు, సాంకేతిక నిపుణురాలు సురభి ఆర్.పద్మజ వర్మలను పురస్కార కమిటీ ఎంపిక చేసినట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. వీరికి నేడు తెలుగు యూనివర్సిటీలో సత్కరించనున్నారు.

News August 19, 2025

గతంలో 3 నెలలు ఊచలు లెక్కించిన ‘సృష్టి’ నమ్రత

image

అక్రమ సరోగసి కేసులో అరెస్ట్ అయిన డా.నమ్రత గతంలో 3 నెలలు జైలులో ఉండి వచ్చారు. 2020లో ఏపీలోని మాడుగులకు చెందిన ఓ మహిళ నమ్రతపై ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లింది. తనకు మాయమాటలు చెప్పి తన బిడ్డను తీసుకున్నారని ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు విశాఖ జైలుకు తరలించారు. జైలు నుంచి తిరిగి వచ్చినా నమ్రత దందా కొనసాగించి ఇటీవల మళ్లీ అరెస్ట్ అయింది.

News August 19, 2025

యూరియా కేటాయింపులో తెలంగాణకు అన్యాయం: ఎంపీ

image

యూరియా కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. యూరియా సమస్యపై మంగళవారం పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీతో కలిసి ఖమ్మం ఎంపీ ప్లకార్డులతో నిరసన తెలిపారు. తెలంగాణకు రావాల్సిన మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తక్షణమే సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.