News August 19, 2025
ఏపీ ముచ్చట్లు

* ఇవాళ శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల బ్రహ్మోత్సవాలు. తొలి రోజున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పణ. సెప్టెంబర్ 28న గరుడసేవ.
* సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న అంగన్వాడీల నిరసన
* రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు(SBTET)కు NCVET గుర్తింపు. ఇకపై సాంకేతిక విద్య పరిధిలోని కోర్సులు చేసిన విద్యార్థులకు డ్యుయల్ సర్టిఫికెట్.
Similar News
News August 19, 2025
మోదీ భజనలో బిజీగా కిషన్ రెడ్డి, బండి సంజయ్: రేవంత్

TG: రైతుల అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని CM రేవంత్ ఫైరయ్యారు. కేంద్రాన్ని ఎండగడుతూ పార్లమెంట్ ఆవరణలో TG కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపిన ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోదీ భజన చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తేవడం కోసం కలిసి రావాల్సిన BRS ఎంపీలు పత్తా లేరని దుయ్యబట్టారు.
News August 19, 2025
కాంగోలో మారణకాండ.. 52 మందిని నరికి చంపారు

కాంగోలో అల్లైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ADF) మారణకాండకు పాల్పడింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతున్న ఈ గ్రూప్ ఈనెల 9-16 మధ్య దాదాపు 52 మంది సివిలియన్లను కిరాతకంగా నరికి చంపినట్లు UN వెల్లడించింది. ADF మెంబర్స్ కొన్నేళ్లుగా కిడ్నాప్‌లు, చోరీలు, ఇళ్లు, వాహనాలు తగలబెట్టడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. వీరు ఉగాండా, కాంగో సరిహద్దుల్లో ఉంటూ నేరాలు చేస్తున్నారు. ADFపై US, UN ఇప్పటికే ఆంక్షలు విధించాయి.
News August 19, 2025
కొత్త మిస్ యూనివర్స్ ఇండియా ఎవరంటే?

మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీలో రాజస్థాన్‌కు చెందిన మనికా విశ్వకర్మ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా గతేడాది విజేత రియా సింఘా ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. దీంతో ఆమె మన దేశం తరపున 74వ యూనివర్స్ పోటీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న ఆమె పోటీలో తన అందం, ప్రతిభ, తెలివితేటలతో న్యాయమూర్తులను ఆకట్టుకుని విజయం సాధించారు. మొదటి రన్నరప్ తాన్య శర్మ(UP).