News August 19, 2025
నిర్మల్ జిల్లాలో 428.2 మి.మీ వర్షపాతం

నిర్మల్ జిల్లాలో గడిచిన 24గంటల్లో 428.2మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుబీర్14.2, తానూర్13.8, బాసర8.4, ముధోల్ 15.2, భైంసా 18.4, కుంటాల 30.8, నర్సాపూర్ 18.2, లోకేశ్వరం 18.4, దిలావర్పూర్ 25.4, సారంగాపూర్ 37.2, నిర్మల్ 32.6, నిర్మల్ రూరల్ 26.4, సోన్ 24.4, లక్ష్మణచందా 17.2, మమడ 25.2, పెంబి 27.6, ఖానాపూర్ 22.2, కడెం 21.2, దస్తురాబాద్ 31.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.
Similar News
News August 19, 2025
పెద్దాపురం నియోజకవర్గంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో సామర్లకోటలో పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్.ఎస్.మోహన్ పరిశీలించారు. మంగళవారం ఆయన ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల పూర్ణ కళ్యాణ మండపంలో ప్రజావేదిక నిర్వహించనున్న ప్రాంతాన్ని జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News August 19, 2025
ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే

దుబాయ్ వేదికగా వచ్చే నెల 9 నుంచి స్టార్ట్ కానున్న ఆసియా కప్‌కు BCCI భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.
జట్టు: సూర్య(C), గిల్(VC), అభిషేక్, శాంసన్, పాండ్య, తిలక్, దూబే, జితేశ్, రింకూ, చక్రవర్తి, అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్, కుల్దీప్, హర్షిత్ రాణా.
స్టాండ్‌బై: జైస్వాల్, ప్రసిద్, జురెల్, రియాన్ పరాగ్, సుందర్.
News August 19, 2025
ప్రపంచకప్ పోటీలకు సూర్యాపేట బిడ్డ

సూర్యాపేట (D) చెందిన నరేష్ యాదవ్ అమెరికాలో జరగనున్న సిటింగ్ వాలీబాల్ వరల్డ్ కప్ 2025 పోటీలకు ఎంపికయ్యాడు. మేళ్లచెరువు (M) కందిబండకి చెందిన నరేష్ అక్టోబర్ 8 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో అతని ప్రతిభ ఆధారంగా పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. ఈ అవకాశం పొందడం ద్వారా నరేష్ స్వగ్రామానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చాడు.