News August 19, 2025

ఉపరాష్ట్రపతి అభ్యర్థి బరిలోకి మార్కాపురం వాసి.!

image

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంటకు చెందిన డాక్టర్ మందటి తిరుపతిరెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన సమర్పించిన నామినేషన్‌కు ఆమోదం సైతం లభించింది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా గుర్తింపు పొందిన తిరుపతిరెడ్డి 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎన్నికలు జరుగుతుండగా మరోమారు నామినేషన్ వేశారు.

Similar News

News August 19, 2025

భైరవకోనకు వెళ్తున్నామని.. మృత్యువు ఒడిలోకి

image

కనిగిరి మండలం పునుగోడు చెరువులో మంగళవారం మృతి చెందిన ఇద్దరు యువకుల వివరాలు, ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఎస్సై శ్రీరామ్ వివరాల మేరకు.. కనిగిరి మున్సిపల్ పరిధిలోని శంకవరం గ్రామానికి చెందిన ఎన్నింటి గౌతమ్ (17), కనిగిరి నక్కల తిప్పకు చెందిన బొందలపాటి శివప్రసాద్(19)గా గుర్తించారు. వీరిద్దరూ ఈనెల 17న భైరవకోనకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బయటకు వచ్చారు. ఈ క్రమంలో వారు మృత్యువాత పడ్డారు.

News August 19, 2025

ప్రకాశం: పునుగోడు చెరువులో పడి ఇద్దరు మృతి

image

ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని పునుగోడు చెరువులో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న SI శ్రీరామ్ సిబ్బందితో కలిసి చెరువులోని మృతదేహాలను వెలికితీశారు. మృతిచెందిన వారు ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. కొద్దిసేపట్లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కనిగిరికి తరలించే అవకాశం ఉంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.