News August 19, 2025
ట్రైన్ టికెట్లు బుక్ అవుతున్నాయా?

IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్లు బుక్ అవ్వట్లేదని పలువురు SMలో పోస్ట్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి లాగిన్, బుకింగ్స్ సమస్య నెలకొందని చెబుతున్నారు. పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయని, ఎర్రర్ మెసేజెస్ వస్తున్నాయని రిపోర్ట్ చేస్తున్నారు. IRCTC డౌన్ అయిందని పలు ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్స్ కూడా వెల్లడించాయి. అయితే దీనిపై ఇప్పటివరకు సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. మీకూ ఈ సమస్య ఎదురైందా?
Similar News
News August 19, 2025
జట్టు ఎంపికపై స్పందించిన అగార్కర్

ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపిక కఠినంగా సాగిందని చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపారు. ‘అంచనాలు అందుకోవడంతోనే గిల్‌ను ఎంపిక చేశాం. అభిషేక్‌తో కలిసి గిల్, శాంసన్‌లో ఎవరూ ఓపెనింగ్ చేస్తారనేది ఇంకా డిసైడ్ చేయలేదు. శ్రేయస్ తప్పేం లేదు. అభిషేక్ బౌలింగ్ కూడా చేయగలడు. అందుకే జైస్వాల్‌ను కాదని అతడిని తీసుకున్నాం. కానీ జట్టులో 15 మందికే చోటు ఇవ్వగలం. 2026 T20 WCకి ఈ జట్టే ఫైనల్ కాదు’ అని చెప్పారు.
News August 19, 2025
రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

TG: ఇవాళ ఆసిఫాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డితో పాటు ఇతర చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
News August 19, 2025
ఆసియా కప్: స్టార్ ప్లేయర్లకు షాక్

ఆసియా కప్ జట్టులో చోటు దక్కుతుందని ఆశించిన పలువురు టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. శ్రేయస్ అయ్యర్, KL రాహుల్‌కు చోటు దక్కలేదు. రెస్ట్ పేరిట సిరాజ్‌ను తీసుకోలేదు. ఈ ఏడాది IPLలో మెరిసిన ప్రసిద్, సుందర్, సుదర్శన్, శశాంక్, పరాగ్ వంటి యంగ్ ప్లేయర్లనూ ఎంపిక చేయలేదు. జైస్వాల్, ప్రసిద్, జురెల్, పరాగ్, సుందర్‌ను స్టాండ్‌బైగా పెట్టారు. సెలక్టర్లు ఎంపిక చేసిన <<17452199>>జట్టుపై<<>> మీ కామెంట్?