News August 19, 2025
వరంగల్: జిల్లాలో వర్షపాతం వివరాలు..!

జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు 199.3 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటు వర్షపాతం 15.3 మి.మీ.గా ఉంది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 24.9 మి.మీ. వర్షం కురిసింది. ఖానాపూర్, దుగ్గొండి మండలాల్లో 24 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. చెన్నారావుపేటలో 22.3, గీసుగొండ, వరంగల్‌లో 16.3 మి.మీ. వర్షం పడింది.
Similar News
News August 21, 2025
వరంగల్ కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు: కలెక్టర్

యూరియా కొరత, ఇతర వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం రైతులు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 18004253424, ఫోన్ నంబర్లు 0870-2530812, 9154252936లకు సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.
News August 20, 2025
వరంగల్ జిల్లాలో తగ్గిన వర్షాలు

వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం వరకు 105 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా సంగెంలో 18.4, నెక్కొండ 15.1, పర్వతగిరి 13.8 మి.మీ. వర్షం కురిసింది. చెన్నారావుపేటలో 12.3, ఖిల్లా వరంగల్, వర్ధన్నపేటలో 7.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. తక్కువగా వరంగల్ పట్టణంలో 2.4 మి.మీ. వర్షం నమోదైంది.
News August 20, 2025
WGL: నకిలీ డాక్టర్లను పట్టుకున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం

అర్హత లేకుండా క్లినిక్ నడుపుతున్న సెంటర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఇద్దరు నకిలీ డాక్టర్లను పట్టుకున్నట్లు కౌన్సిల్ సభ్యుడు డా.వి.నరేశ్ కుమార్ తెలిపారు. వరంగల్, కాశిబుగ్గ తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ డాక్టర్ అని పోస్టర్లు కొట్టించుకొని, ఆర్ఎంపీల జిల్లా ప్రెసిడెంట్‌గా చెప్పకుంటూ రోగులను మోసం చేస్తున్నట్లు వెల్లడించారు.