News August 19, 2025
‘ఈనెల 24న చొప్పదండికి మీనాక్షి మేడమ్’

ఈనెల 24న చొప్పదండి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర ముఖ్యనేతలు యాత్రలో పాల్గొననున్నారని చెప్పాయి. 25వ తేదీ ఉదయం 7 గంటల వరకు శ్రమదానం, పార్టీ నేతల సమావేశం ఉంటుందన్నాయి.
Similar News
News August 19, 2025
‘వార్-2’కు రూ.300 కోట్ల కలెక్షన్స్

‘వార్-2’ సినిమా ఇప్పటివరకు రూ.300.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. ఇండియాలో రూ.240 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.60.50 కోట్లు వచ్చినట్లు తెలిపింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, Jr.NTR ప్రధాన పాత్రల్లో నటించారు. YRF స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ మూవీ అగస్టు 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
News August 19, 2025
ఐదుగురు మృతి.. నివేదిక కోరిన HRC

HYD రామంతాపూర్‌లో విద్యుత్ షాక్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన <<17438408>>ఘటనను <<>>రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనకు కారణాలు, బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు భద్రతా చర్యలపై విద్యుత్ శాఖను నివేదిక కోరింది. సెప్టెంబర్ 22లోపు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని TGSPDCL CMDకి గడువు విధించింది.
News August 19, 2025
రాజమండ్రి: నకిలీ దస్తావేజులు సృష్టించే ముఠా అరెస్ట్

నకిలీ దస్తావేజులు సృష్టించి ఆస్తులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య తెలిపారు. రాజమండ్రికి చెందిన గొల్లపల్లి కాశీ విశాలాక్షి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు చేపట్టిన విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కవలగొయ్యిలోని విశాలాక్షి ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మివేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.