News August 19, 2025

చించినాడ బ్రిడ్జిపై ఆగస్టు 21 వరకు ఆంక్షలు: కలెక్టర్

image

చించినాడ వంతెన మరమ్మతుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను ఆగస్టు 21 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో సాయంత్రం 7 గంటల వరకు ఉన్న ట్రాఫిక్ బ్లాక్ సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడిగించామన్నారు. ప్రజలు ఈ ఆంక్షలకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

Similar News

News August 19, 2025

కంటి చూపు ఎంతో ప్రధానం: కలెక్టర్ నాగరాణి

image

కంటి చూపు ఎంత ప్రధానమో చూపు తగ్గిన వారు దాని నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉచిత కళ్ల జోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారికి కంటె అద్దాలు అందజేశారు. కంటిచూపు పోతే తిరిగి పొందలేం అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

News August 19, 2025

నరసాపురం: సైలింగ్ బోటింగ్‌కు వంద మంది క్యాడెట్లు

image

వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి 10వ వరకు ఒరిస్సాలోని చిలుక నేవల్ బేస్‌లో నరసాపురం ఆంధ్రా యూనిట్ ఆధ్వర్యంలో సైలింగ్ బోటింగ్ సాహస యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది క్యాడెట్లు పాల్గొనన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను యూనిట్ కమాండర్ సంజిత్ రౌత్రే, డిప్యూటీ క్యాంపు కమాండర్ అనిల్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.

News August 19, 2025

భీమవరం: కల్లు గీత కార్మికులకు బార్ల ఎంపిక

image

జిల్లాలోని కల్లుగీత కార్మికులకు కొత్తగా మంజూరైన 3 బార్లకు కులాల వారి రిజర్వేషన్ ప్రక్రియను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో కల్లు గీత కార్మికులకు కేటాయించిన బార్ల ఎంపిక రిజర్వేషన్ ప్రక్రియను లాటరీ తీసి ఎంపిక చేశారు. శెట్టి బలిజలకు -2, గౌడ – 1ను భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో కేటాయించడం జరిగిందన్నారు.