News August 19, 2025
విద్యార్థులకు నిరంతర అభ్యాసం అవసరం: డా.రత్తయ్య

విద్యార్థులకు నిరంతర అభ్యాసం అవసరమని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరగలరని విజ్ఞాన్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డా.లావు రత్తయ్య తెలిపారు. విద్యార్థుల్లో చదువు, అభివృద్ధి అనేది సంతోషంగా జరగాల్సిన ప్రక్రియని చెప్పారు. సోమవారం బీటెక్ 1st ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులందికీ అభినందనలు తెలిపారు.
Similar News
News August 19, 2025
‘వార్-2’కు రూ.300 కోట్ల కలెక్షన్స్

‘వార్-2’ సినిమా ఇప్పటివరకు రూ.300.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. ఇండియాలో రూ.240 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.60.50 కోట్లు వచ్చినట్లు తెలిపింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, Jr.NTR ప్రధాన పాత్రల్లో నటించారు. YRF స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ మూవీ అగస్టు 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
News August 19, 2025
ఐదుగురు మృతి.. నివేదిక కోరిన HRC

HYD రామంతాపూర్‌లో విద్యుత్ షాక్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన <<17438408>>ఘటనను <<>>రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనకు కారణాలు, బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు భద్రతా చర్యలపై విద్యుత్ శాఖను నివేదిక కోరింది. సెప్టెంబర్ 22లోపు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని TGSPDCL CMDకి గడువు విధించింది.
News August 19, 2025
రాజమండ్రి: నకిలీ దస్తావేజులు సృష్టించే ముఠా అరెస్ట్

నకిలీ దస్తావేజులు సృష్టించి ఆస్తులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య తెలిపారు. రాజమండ్రికి చెందిన గొల్లపల్లి కాశీ విశాలాక్షి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు చేపట్టిన విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కవలగొయ్యిలోని విశాలాక్షి ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మివేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.