News August 19, 2025

రోహిత్, కోహ్లీ.. ప్రాక్టీస్ మొదలెట్టారు!

image

భారత స్టార్ క్రికెటర్స్ రోహిత్, విరాట్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌ ఆధ్వర్యంలో రోహిత్ జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫొటో వైరలవుతోంది. మరోవైపు విరాట్ లండన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఫ్యాన్‌తో దిగిన సెల్ఫీ SMలో హాట్ టాపిక్‌‌గా మారింది. ‘వరల్డ్ కప్ వేట మొదలైంది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ AUSతో OCT 19న స్టార్ట్ కానున్న ODI సిరీస్‌లో ఆడే అవకాశముంది.

Similar News

News August 19, 2025

ఐదుగురు మృతి.. నివేదిక కోరిన HRC

image

HYD రామంతాపూర్‌లో విద్యుత్ షాక్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన <<17438408>>ఘటనను <<>>రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనకు కారణాలు, బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు భద్రతా చర్యలపై విద్యుత్ శాఖను నివేదిక కోరింది. సెప్టెంబర్ 22లోపు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని TGSPDCL CMDకి గడువు విధించింది.

News August 19, 2025

ఇందిరమ్మ ఇళ్ల ‘గృహప్రవేశానికి’ సీఎం!

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఇప్పటివరకు 4వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో స్థానిక ఎన్నికలకు ముందే గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. ఆయా కార్యక్రమాల్లో సీఎంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. ఈనెల 21న CM రేవంత్ రెడ్డి అశ్వారావుపేటలో జరగనున్న గృహప్రవేశ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

News August 19, 2025

1GB ప్లాన్ ఎత్తేసిన JIO.. నెట్టింట విమర్శలు

image

డైలీ 1GB డేటా రీచార్జ్ ప్లాన్‌ను ఎత్తేయడంతో JIOపై విమర్శలొస్తున్నాయి. ఈ నిర్ణయం ఎంతో మందికి అధిక భారం కావొచ్చని, ఇష్టానుసారంగా ప్లాన్స్ ఛేంజ్ చేస్తుంటే TRAI నిద్రపోతోందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సరసమైన ధరలకే రీఛార్జ్ లభించే ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNLలో సిగ్నల్స్ సమస్య వెంటాడుతోందని చెబుతున్నారు. వీలైనంత త్వరగా 5G తీసుకొచ్చి, మంచి సర్వీస్ ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. మీ కామెంట్?