News August 19, 2025
యూట్యూబ్‌లో ఇంకా ‘సృష్టి’ వీడియోలు!

సృష్టి ఫెర్టిలిటి సెంటర్ నిర్వాహకురాలిగా డా.నమ్రత యూ ట్యూబ్‌లో వీడియోలను అప్లోడ్ చేసింది. ఆ వీడియోలు ఇంకా అందులోనే ఉన్నాయి. సరోగసి పేరుతో నవజాత శిశువులను విక్రయించి రిమాండులో ఉన్న నమ్రత ప్రసంగాలు ఇంకా అందుబాటులో ఉండటంతో పలువురు మండిపడుతున్నారు. ఇంత మోసం చేసిన ఆమె వీడియోలు యూట్యూబ్‌లో తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరీ మీరేమంటారు.
Similar News
News August 19, 2025
రామంతాపూర్ ఘటనపై HRC సీరియస్.. సుమోటోగా కేసు

HYD రామంతాపూర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్రలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడడం విషాదకరమని HRC వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై HRC సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసింది. ఘటనకు గల కారణం, అధికారుల నిర్లక్ష్యం, తక్షణ పరిష్కార చర్యలు, బాధితుల కుటుంబాలకు పరిహారం, భద్రతా చర్యలపై సెప్టెంబర్ 22వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని TGSPDCL సీఎండీకి ఆదేశాలు జారీ చేసింది.
News August 19, 2025
RR: ఆకులమైలారం బిడ్డ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా..!

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బి.సుదర్శన్ రెడ్డి <<17452574>>ఎంపికైన విషయం<<>> తెలిసిందే. రంగారెడ్డి(D) కందుకూరు(M) ఆకులమైలారంలో 1946 జులై 8న ఓ సాధారణ రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. 1971లో HYDలోని ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. ప్లీడర్‌గా పని చేసిన ఆయన 1990లో ఓయూ లీగల్ అడ్వైజర్‌గా ఉన్నారు. తమ గ్రామస్థుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడంపై ఆకులమైలారం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News August 19, 2025
చర్లపల్లి: నాయుడుపేట వెళ్లే ప్రజలకు గుడ్‌న్యూస్

సిటీ నుంచి నాయుడుపేట వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెగ్యులర్‌గా చర్లపల్లి నుంచి చెన్నయ్ వెళ్లే రైలు నాయుడుపేట మీదుగా వెళ్తుంది. అయితే అక్కడ స్టాపేజ్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ప్రయాణికుల కోరిక మేరకు నాయుడుపేటలో స్టాప్ ఏర్పాటు చేశారు. దీంతో చర్లపల్లి- చెన్నై ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (12604) ఇక నుంచి 2 నిమిషాల పాటు నాయుడుపేటలో ఆగుతుంది.