News August 19, 2025
HYD: పీ.వీ.రమణ రంగస్థల పురస్కారాలు.. గ్రహీతలు వీళ్లే.!

2024,2025 సంవత్సరానికి పీ.వీ.రమణ జయంతి సందర్భంగా పీ.వీ.రమణ రంగస్థల పురస్కారాలు తెలుగు యూనివర్సిటీ ప్రదానం చెయ్యనుంది. 2024 సం.నికి ప్రముఖ రంగస్థల సంగీత దర్శకుడు టి.రాజబాబు, 2025 సం.నికి రంగస్థల నటి, దర్శకురాడు, సాంకేతిక నిపుణురాలు సురభి ఆర్.పద్మజ వర్మలను పురస్కార కమిటీ ఎంపిక చేసినట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. వీరికి నేడు తెలుగు యూనివర్సిటీలో సత్కరించనున్నారు.
Similar News
News August 19, 2025
vkb: జిల్లాలో వర్షపాతం వివరాలు

వికారాబాద్ జిల్లాలో సోమవారం 16.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మర్పల్లి 21.5, మోమిన్‌పేట్ 32.7, నవాబుపేట్ 25, వికారాబాద్ 26.2, పూడూర్ 24.1, పరిగి 19.9, కుల్కచర్ల 17.3, దోమ 15, బొంరాస్పేట్ 11.6, దారుర్ 18.2, కోట్‌పల్లి 3.8, బంట్వారం 16.6, పెద్దేముల్ 20.2, తాండూర్ 18, బషీరాబాద్ 11.4, యాలాల్ 12.6, కొడంగల్ 7.9, దౌల్తాబాద్ 5.1, దుద్యాల్ 6.8 మిల్లీమీటర్లు నమోదైంది.
News August 19, 2025
16 సర్కిళ్ల SE, DE ఆపరేషన్, DE టెక్నికల్స్‌తో CMD వీడియో కాన్ఫరెన్స్

హనుమకొండలోని TGNPDCL కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి 16 సర్కిళ్ల SE, DE ఆపరేషన్, DE టెక్నికల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాది నుంచి పోల్స్‌పై ఉన్న కేబుల్ వైర్లు తొలగించమని కేబుల్ ఆపరేటర్లకు విన్నవించినా పట్టించుకోవట్లేదని, విద్యుత్ ప్రమాదాల జరుగుతున్నాయన్నారు. అందుకు అనుగుణంగా కేబుల్ వైర్లు రీ-అలైన్‌మెంట్ చేసుకోవాలని లేదంటే తొలగించాలని ఎస్ఈలను ఆదేశించారు.
News August 19, 2025
JNTUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీలు

అనంతపురం జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ECE (4), CSE (3), సివిల్స్ (2), ఇంగ్లిష్ (1), ఫిజిక్స్ (1) ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగష్టు 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ”principal.cea@jntua.ac.in” కు తమ బయోడేటాను పంపాలని ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి తెలిపారు. ఇందుకు పీజీ అర్హత ఉంటే చాలు. ఇంటర్వ్యూ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.