News April 1, 2024
KNR: మిర్చి బండి మహిళతో KTR ముచ్చట్లు

HYD అంబర్‌పేట్‌లో మాజీ మంత్రి KTR.. BRS సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబర్‌పేట్‌లో రోడ్డు పక్కన ఉన్న ఓ మిర్చి బండి మహిళతో KTR ముచ్చటించారు. ఆమెతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో BRSను గెలిపించాలని KTR కోరారు. మన తెలంగాణ గళం పార్లమెంట్‌లో వినిపించాలంటే BRSతోనే సాధ్యమని అన్నారు.
Similar News
News April 4, 2026
ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదుపై కరీంనగర్ సీపీ సమీక్ష

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. ఎస్‌హెచ్‌ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. మహిళలు, చిన్నారుల కేసుల్లో వీడియో రికార్డింగ్, ఎస్‌ఓపీలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

KNR జిల్లా తిమ్మాపూర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు “బ్యూటీ పార్లర్ మెనేజ్ మెంట్” లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 18-45 సం.ల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, శిక్షణ ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు.