News August 19, 2025
కాంగోలో మారణకాండ.. 52 మందిని నరికి చంపారు

కాంగోలో అల్లైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ADF) మారణకాండకు పాల్పడింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతున్న ఈ గ్రూప్ ఈనెల 9-16 మధ్య దాదాపు 52 మంది సివిలియన్లను కిరాతకంగా నరికి చంపినట్లు UN వెల్లడించింది. ADF మెంబర్స్ కొన్నేళ్లుగా కిడ్నాప్‌లు, చోరీలు, ఇళ్లు, వాహనాలు తగలబెట్టడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. వీరు ఉగాండా, కాంగో సరిహద్దుల్లో ఉంటూ నేరాలు చేస్తున్నారు. ADFపై US, UN ఇప్పటికే ఆంక్షలు విధించాయి.
Similar News
News August 19, 2025
OFFICIAL.. OTTలోకి హరి హర వీరమల్లు

జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’-1 మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ఆగస్టు 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భారీ అంచనాల నడుమ జులై 24న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంత ఆకట్టుకోలేదు. విడుదలైన నెల రోజుల్లోపే OTTలోకి వచ్చేస్తోంది.
News August 19, 2025
ఆ ఆరోపణల్లో నిజం లేదు: ధర్మస్థల ఆలయ చీఫ్

కర్ణాటక ధర్మస్థలలో గత రెండు దశాబ్దాలుగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలను ఆలయ చీఫ్ వీరేంద్ర హెగ్గడే ఖండించారు. దీనిపై SIT దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ‘మాపై తప్పుడు ప్రచారం జరగడం ఎంతో బాధించింది. వీలైనంత త్వరగా నిజం బయటకు రావాలి. ధర్మస్థలలో చనిపోతే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఎవరైనా చనిపోతే పంచాయతీ సిబ్బంది ఆ మృతదేహాలను పూడ్చిపెట్టేవారు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
News August 19, 2025
రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నిర్మల్‌లో రేపు కూడా కుండపోత వానలు ఉన్నందున్న అధికారులు అలర్ట్ అయ్యారు. బుధవారం స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అభిలాష ఉత్తర్వులిచ్చారు. విద్యార్థుల రవాణా, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అటు కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.