News August 19, 2025

HYD: జాగ్రత్త.. వీడియో కాల్ న్యూడ్ కాల్‌గా మారుస్తున్నారు

image

సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. డేటింగ్ యాప్‌లో పరిచయం చేసుకొని వీడియో కాల్స్ మాట్లాడించి ఆ తర్వాత దానిని మార్ఫింగ్ చేసి నగ్న వీడియోగా మార్చి బెదిరిస్తున్నారు. గుడిమల్కాపూర్‌కు చెందిన యువకుడి నుంచి రూ.1.80 లక్షలు వసూలు చేశారు. తిరిగి లక్షల్లో డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వారితో అసలు వీడియో కాల్‌లో మాట్లాడవద్దని సైబర్ పోలీసులు చెబుతున్నారు.

Similar News

News August 19, 2025

నాగార్జున సాగర్ ఎత్తిపోతల జలపాతం చూసొద్దాం రండి..!

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలోని ఎత్తిపోతల జలపాతం సందర్శనకు ప్రత్యేకంగా బస్సు నడుపుతున్నట్లు HYD మియాపూర్‌ డిపో మేనేజర్‌ మోహన్‌రావు ఈరోజు తెలిపారు. ఈనెల 24న ఉ.5 గంటలకు మియాపూర్‌ నుంచి బయల్దేరి జలపాతం వద్దకు వెళ్లి తిరిగి అదే రోజు రా.8 గంటలకు మియాపూర్‌కు చేరుకుంటుందన్నారు. ఆసక్తి గల ప్రయాణికులు 8500309052 నంబర్‌కు ఫోన్‌ చేసి, టికెట్లు బుక్‌ చేసుకోవాలని, ఒక్కో టికెట్‌ ధర రూ.1,200 అని తెలిపారు.  

News August 19, 2025

హైదరాబాద్‌లో వానాకాలం చదువులు..!

image

వానాకాలం చదువులు.. ఈ పేరు విన్నారా.. అంటే వర్షం వచ్చినపుడు ఆరోజు స్కూలుకు వెళ్లేది లేదన్నమాట.. పెద్దలు ఈ మాట చెబుతూ ఉంటారు. ఇపుడు మహానగరంలో ఆ పరిస్థితి నెలకొంది. జీడిమెట్ల అయోధ్య నగర్‌ ప్రాథమిక ఆవరణ వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో విద్యార్థులు లోపలకు వెళ్లలేని పరిస్థితి. సుమారు 230 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ సమస్య ఉంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

News August 19, 2025

BREAKING: కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

image

HYD కూకట్‌పల్లి సహస్ర <<17454835>>హత్య కేసులో<<>> కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవనంలో ఉన్న వారిలో ఎవరో బాలికను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చేతబడి కారణంగా హత్య జరిగి ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. హత్య జరిగిన రోజున భవనం వైపు కొత్త వ్యక్తులు ఎవరూ రాకపోవడంతో, బాలికకు తెలిసినవారే నిందితులుగా ఉండొచ్చని పోలీసులు నిర్ధారించారు. బాలిక గొంతుపై ఏకంగా 7 సార్లు పొడిచినట్లు గుర్తించారు.