News August 19, 2025
ప్రకాశం: పునుగోడు చెరువులో పడి ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని పునుగోడు చెరువులో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న SI శ్రీరామ్ సిబ్బందితో కలిసి చెరువులోని మృతదేహాలను వెలికితీశారు. మృతిచెందిన వారు ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. కొద్దిసేపట్లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కనిగిరికి తరలించే అవకాశం ఉంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 19, 2025
ఉద్యానవన పంటల సాగుపై చైతన్య పరచాలి: కలెక్టర్

జిల్లాలో ఉద్యానవన పంటల సాగుకు సంబంధిత అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మంగళవారం ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. ఉద్యానవన పంటలకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. రైతులను ప్రోత్సహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.
News August 19, 2025
‘పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టాలి’

జిల్లాలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జేసీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన రీ సర్వే ప్రక్రియ, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు.
News August 19, 2025
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి: కలెక్టర్

జిల్లాలో 10వ తరగతి విద్యార్హత ఉన్నవారు కనీసం 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు ఉల్లాస్ అక్షర ఆంధ్ర అక్షరాస్యత కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమన్నారు.