News August 19, 2025
సిద్దిపేట: ఇంటిని జాకిలతో పైకి ఎత్తేశారు !

టెక్నాలజీ ఉపయోగించుకుంటే అన్ని సాధ్యమే అన్నట్టుంది. సిద్దిపేటలో టైర్లు మార్చుకునేందుకు ఉపయోగించే జాకీలతో ఇంటిని పైకెత్తారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేటకు చెందిన ఆరుట్ల యాదవరెడ్డి 15ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించగా ఇప్పుడు అది రోడ్డుకు సమాంతరంగా ఉంది. దీంతో ఇంటిని 3 నుంచి 5 ఫీట్లు ఎత్తు పెంచేందుకు ఓ కన్సెక్షన్‌ను సంప్రదించగా 15 మంది కూలీల సాయంతో 100 జాకీలతో పని మొదలు పెట్టి ఇంటిని పైకి లేపారు.
Similar News
News August 19, 2025
HYD: డాక్టరేట్ పట్టా పొందిన ఎమ్మెల్సీ దయాకర్

ఉస్మానియా విశ్వవిద్యాలయం 84వ స్నాతకోత్సవం ఈరోజు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓయూ ఛాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణ్, వీసీ కుమార్ మొగులం చేతుల మీదుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన మాట్లాడుతూ.. గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా నిర్వహించారు. వర్ష నష్టాల అంచనా వెంటనే పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇతర శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.