News August 19, 2025

సుదర్శన్ రెడ్డి ఎంపికకు కారణమిదేనా?

image

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా <<17451888>>బి.సుదర్శన్‌రెడ్డి<<>> ఎంపిక వ్యూహాత్మక నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయేతర వ్యక్తిని బరిలో దింపడంతో NDAతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలను ఇరకాటంలో పెట్టినట్లైందంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని TDP, YSRCP, BRS పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకే తెలుగు వ్యక్తిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. సుదర్శన్‌రెడ్డి CM చంద్రబాబుకు సన్నిహితుడు కావడం గమనార్హం.

Similar News

News August 19, 2025

NEET(PG) ఫలితాలు విడుదల

image

నీట్(పీజీ)-2025 ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS) రిలీజ్ చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. MD, MS, PG డిప్లొమా ప్రోగ్రాముల్లో చేరేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. జనరల్ అభ్యర్థులకు 276/800 మార్కులు కటాఫ్‌ కాగా జనరల్ PwD అభ్యర్థులకు 255.. SC, ST, OBC క్యాండిడేట్లకు 235 మార్కులుగా నిర్ణయించారు.

News August 19, 2025

మోదీకి చిత్తశుద్ధి ఉంటే పెట్రో ధరలు తగ్గించాలి: KTR

image

TG: రేపు GST కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కేంద్రానికి మాజీ మంత్రి KTR లేఖాస్త్రం సంధించారు. GSTలోని 12% శ్లాబ్ రద్దు ప్రతిపాదన కంటితుడుపు చర్య అని విమర్శించారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలన్నారు. రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న పన్నులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టాలని KTR సూచించారు.

News August 19, 2025

OFFICIAL.. OTTలోకి హరి హర వీరమల్లు

image

జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’-1 మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ఆగస్టు 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భారీ అంచనాల నడుమ జులై 24న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంత ఆకట్టుకోలేదు. విడుదలైన నెల రోజుల్లోపే OTTలోకి వచ్చేస్తోంది.