News April 1, 2024

ఒక్క మ్యాచుతో ధోనీ సరికొత్త రికార్డులు

image

నిన్న ఢిల్లీతో మ్యాచులో సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ ఖాతాలో పలు రికార్డులు చేరాయి. ఐపీఎల్ ఒకే ఓవర్లో 20 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచారు. ధోనీ 9 సార్లు ఈ ఫీట్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(8) ఉన్నారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో 19, 20వ ఓవర్లలో 100 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్‌గా ధోనీ రికార్డులకెక్కారు.

Similar News

News March 15, 2026

సూరంపేట: ఆవుపై పులి దాడి

image

కొడిమ్యాల మండలం సూరంపేట అడవుల్లో ఆవును పులి చంపినట్లు అటవీశాఖ అధికారులు ఆదివారం గుర్తించారు. పులి కథలాపూర్ మండలం తుర్తి అటవీ ప్రాంతం నుంచి కొడిమ్యాల మండలం సూరంపేట అడవుల్లోకి వెళ్లినట్టు పాదముద్రల ఆధారంగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. సూరంపేట అడవిలో పులి ఆవును చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరారు.

News March 15, 2026

నేడే ఎన్నికల షెడ్యూల్.. 4 గం.కు ప్రెస్ మీట్

image

4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదల అయ్యే అవకాశం ఉందని ANI తెలిపింది. సా.4 గం.కు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుందని పేర్కొంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈసీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించింది.

News March 15, 2026

సన్‌రైజర్స్‌కు పాక్ ప్లేయర్ దూరం?

image

The Hundred టోర్నీ కోసం అబ్రార్(పాక్)ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ లీగ్ జులై 21-AUG 16 వరకు కొనసాగనుండగా అదే సమయంలో పాక్ టీమ్ 2 టెస్టుల సిరీస్ కోసం విండీస్‌లో పర్యటించనుంది. అందువల్ల అబ్రార్‌కు పాక్ NOC ఇవ్వకపోవచ్చని, టోర్నీలో ఆడటం అనుమానమేనని సమాచారం. కాగా అతను టోర్నీకి అందుబాటులో ఉంటాడనే కొనుగోలు చేశామని SRH హెడ్ కోచ్ వెటోరీ చెప్పిన విషయం <<19370720>>తెలిసిందే.<<>>