News August 19, 2025
వాట్సాప్ మెసేజ్‌లను AI చదివేస్తుందా? GROK ఏమందంటే!

వాట్సాప్‌లో ‘అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తే ఆ గ్రూప్‌లోని మెసేజ్‌లను ఏఐ చదివేస్తుందనే రూమర్స్ Xలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయాన్ని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ సైతం ట్వీట్ చేశారు. అయితే గ్రోక్ మాత్రం ఈ వాదన తప్పని, ఇది @MetaAIని ట్యాగ్ చేసినప్పుడు మాత్రమే అలా జరుగుతుందని చెబుతోంది. గ్రూప్‌లో స్పెసిఫిక్ అంశాలను మెటాకు ట్యాగ్ చేస్తే పూర్తి వివరాలు, ఫ్యాక్ట్ చెక్ చేయొచ్చంటోంది.
Similar News
News August 19, 2025
ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం: జూపల్లి

TG: రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. వర్షాలు, వరదలకు భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ పరిహారం చెల్లించలేదని, కాంగ్రెస్ సర్కార్ మానవతా దృక్పథంతో ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
News August 19, 2025
ప్రధాని మోదీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈమేరకు మోదీ ట్వీట్ చేశారు. గతేడాది తాను జిన్‌పింగ్‌తో సమావేశమైనప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతి సాధించినట్లు తెలిపారు. వచ్చే SCO సమ్మిట్‌లో ఆయనతో మరోసారి భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇది IND-CHI మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక బంధానికి బాటలు వేస్తుందన్నారు. ఫలితంగా ప్రపంచ శాంతికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
News August 19, 2025
టీమ్ ఇండియాలో ‘నం.8’ సమస్య!

AUS, SA, ENG వంటి జట్లలో చివరి బ్యాటర్లూ సిక్సర్లు కొడతారు. కానీ టీమ్ ఇండియాలో అలా లేదు. ఇది ఎన్నో ఏళ్ల సమస్య. ప్రస్తుతం భారత క్రికెట్ T20 స్పెషలిస్టులతో నిండింది. అయినా సిక్సులు కొట్టే ‘బౌలర్’ లేని సమస్య ఉంది. భారీ టార్గెట్ ఛేదించేక్రమంలో ‘నం.8’ వరకైనా బౌండరీలు కొట్టగలగాలి. <<17452199>>ప్రస్తుత జట్టులో<<>> అర్ష్‌దీప్/హర్షిత్ నం.8లో వచ్చే ఛాన్సుంది. సిక్సుల్లో వారి రికార్డు పేలవం. మీ కామెంట్?