News August 19, 2025
విద్యార్థుల బస్సుల్లో స్త్రీ శక్తి పథకం వర్తించదు: ఆర్టీసీ ఎండీ

AP: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం తీసుకొచ్చిన స్త్రీ శక్తి పథకానికి అద్భుతమైన స్పందన వస్తోందని ఎండీ ద్వారకా తిరుమల రావు అన్నారు. రద్దీకి తగినట్లుగా రాబోయే రోజుల్లో అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించిన బస్సుల్లో ఈ పథకం వర్తించదని తెలిపారు. రోజూ 18 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.
Similar News
News August 19, 2025
ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం: జూపల్లి

TG: రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. వర్షాలు, వరదలకు భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ పరిహారం చెల్లించలేదని, కాంగ్రెస్ సర్కార్ మానవతా దృక్పథంతో ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
News August 19, 2025
ప్రధాని మోదీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈమేరకు మోదీ ట్వీట్ చేశారు. గతేడాది తాను జిన్‌పింగ్‌తో సమావేశమైనప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతి సాధించినట్లు తెలిపారు. వచ్చే SCO సమ్మిట్‌లో ఆయనతో మరోసారి భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇది IND-CHI మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక బంధానికి బాటలు వేస్తుందన్నారు. ఫలితంగా ప్రపంచ శాంతికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
News August 19, 2025
టీమ్ ఇండియాలో ‘నం.8’ సమస్య!

AUS, SA, ENG వంటి జట్లలో చివరి బ్యాటర్లూ సిక్సర్లు కొడతారు. కానీ టీమ్ ఇండియాలో అలా లేదు. ఇది ఎన్నో ఏళ్ల సమస్య. ప్రస్తుతం భారత క్రికెట్ T20 స్పెషలిస్టులతో నిండింది. అయినా సిక్సులు కొట్టే ‘బౌలర్’ లేని సమస్య ఉంది. భారీ టార్గెట్ ఛేదించేక్రమంలో ‘నం.8’ వరకైనా బౌండరీలు కొట్టగలగాలి. <<17452199>>ప్రస్తుత జట్టులో<<>> అర్ష్‌దీప్/హర్షిత్ నం.8లో వచ్చే ఛాన్సుంది. సిక్సుల్లో వారి రికార్డు పేలవం. మీ కామెంట్?