News August 19, 2025
రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందించాలి: కలెక్టర్

జిల్లాలో ఎరువుల కొరత రాకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మహాముత్తారం మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ ఎరువుల లభ్యత, స్టాకు వివరాలను వ్యవసాయ శాఖ ఏవో అనూషను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలన్నారు.
Similar News
News August 19, 2025
ADB: దత్తు కుటుంబానికి ఆర్థికసాయం

మే నెలలో తరోడా వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దత్తు కుటుంబ సభ్యులకు మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.5 లక్షల చెక్కును మంగళవారం ఆదిలాబాద్‌లో అందజేశారు. ఈ విషాధ సంఘటన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం సహాయనిధి కింద కుటుంబానికి ఆర్థికభరోసా కల్పించినట్లు తెలిపారు. MLAలు పాయల్ శంకర్, బొజ్జు పటేల్ తదితరులున్నారు.
News August 19, 2025
విజయవాడ: సిద్ధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇన్, ఔట్ ఫ్లో 4.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని అధికారులు తెలిపారు. రేపటికి మరింత పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. అత్యవసర సహాయక చర్యల కోసం కృష్ణా జిల్లా అవనిగడ్డ, NTR జిల్లా విజయవాడ, కృష్ణా ఘాట్‌లలో NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
News August 19, 2025
HYD: ‘హజ్ యాత్రికులకు గమనిక.. రేపటిలోపు డబ్బు చెల్లించాలి’

హజ్-2026 యాత్రికులకు HYDలో హజ్ కమిటీ కీలక సూచనలు చేసింది. హజ్ యాత్రకు ఎంపికైన వారు ఈనెల 20లోపు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం చెల్లించాలని సూచించింది. అలాగే డబ్బు చెల్లించిన రసీదు, మెడికల్ రిపోర్టులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను ఈనెల 25లోపు ఇవ్వాలని హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్ బియాబని తెలిపారు. హజ్ యాత్రికులు సాధ్యమైనంత త్వరగా ఫీజు చెల్లించాలని కోరారు.