News August 19, 2025

జట్టు ఎంపికపై స్పందించిన అగార్కర్

image

ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపిక కఠినంగా సాగిందని చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపారు. ‘అంచనాలు అందుకోవడంతోనే గిల్‌ను ఎంపిక చేశాం. అభిషేక్‌తో కలిసి గిల్, శాంసన్‌లో ఎవరూ ఓపెనింగ్ చేస్తారనేది ఇంకా డిసైడ్ చేయలేదు. శ్రేయస్ తప్పేం లేదు. అభిషేక్‌ బౌలింగ్ కూడా చేయగలడు. అందుకే జైస్వాల్‌‌ను కాదని అతడిని తీసుకున్నాం. కానీ జట్టులో 15 మందికే చోటు ఇవ్వగలం. 2026 T20 WCకి ఈ జట్టే ఫైనల్ కాదు’ అని చెప్పారు.

Similar News

News August 19, 2025

తీరనున్న యూరియా కష్టాలు!

image

తెలంగాణలోని రైతులకు యూరియా కష్టాలు త్వరలో తీరనున్నాయి. 50వేల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గుజరాత్, కర్ణాటక నుంచి యూరియా తరలింపునకు ఆదేశించింది. మరో వారం రోజుల్లోనే రాష్ట్రానికి యూరియా వస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా చాలాచోట్ల రైతులు ఆందోళనలు చేపట్టారు.

News August 19, 2025

ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం: జూపల్లి

image

TG: రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. వర్షాలు, వరదలకు భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ పరిహారం చెల్లించలేదని, కాంగ్రెస్ సర్కార్ మానవతా దృక్పథంతో ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

News August 19, 2025

ప్రధాని మోదీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ

image

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈమేరకు మోదీ ట్వీట్ చేశారు. గతేడాది తాను జిన్‌పింగ్‌తో సమావేశమైనప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతి సాధించినట్లు తెలిపారు. వచ్చే SCO సమ్మిట్‌లో ఆయనతో మరోసారి భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇది IND-CHI మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక బంధానికి బాటలు వేస్తుందన్నారు. ఫలితంగా ప్రపంచ శాంతికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.