News August 19, 2025
ఇందిరమ్మ ఇళ్ల ‘గృహప్రవేశానికి’ సీఎం!

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఇప్పటివరకు 4వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో స్థానిక ఎన్నికలకు ముందే గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. ఆయా కార్యక్రమాల్లో సీఎంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. ఈనెల 21న CM రేవంత్ రెడ్డి అశ్వారావుపేటలో జరగనున్న గృహప్రవేశ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News August 19, 2025
రేపు పార్లమెంట్‌లో J&K పునర్వ్యవస్థీకరణ బిల్లు!

జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు రేపు పార్లమెంట్‌లో జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టనుందని Republic TV తెలిపింది. హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టి చర్చ మొదలుపెడతారని పేర్కొంది. కాగా J&Kకు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై స్పందన తెలపాలని ఇటీవల కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
News August 19, 2025
IAFకు కొత్త ఫైటర్ జెట్లు.. రూ.62,000 కోట్లతో ఒప్పందం!

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 97 LCA మార్క్ 1A ఫైటర్ జెట్ల తయారీ బాధ్యతలను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకు కేంద్రం అప్పగించింది. ఇందుకోసం రూ.62,000 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో MiG-21s ఎయిర్‌క్రాఫ్ట్స్‌ల స్థానంలో వీటిని వాడనున్నారు. LCA మార్క్ 1A ఎయిర్‌క్రాఫ్ట్స్‌ల కోసం కేంద్రం ఆర్డర్ ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో రూ.48,000Crతో 83 ఫైటర్ జెట్ల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.
News August 19, 2025
బార్ లైసెన్స్ రుసుము తగ్గింపు

APలో బార్ లైసెన్స్ రుసుమును భారీగా తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం కడపలో లైసెన్స్ ఫీజు రూ.1.97 కోట్లు ఉండగా, ఇప్పుడది రూ.55లక్షలుగా ఉంది. అనంతపురంలో రూ.1.79 కోట్ల నుంచి, తిరుపతిలో రూ.1.72 కోట్ల నుంచి రూ.55 లక్షలకు తగ్గించింది. దీనిని కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అంగీకరించింది. అలాగే రాష్ట్రమంతటా దరఖాస్తు రుసుమును కూడా రూ.5లక్షలకు తగ్గించింది.