News August 19, 2025
ఏలూరు: రైలు ఢీకొని మహిళ మృతి

పొట్టిపాడు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఓ మహిళ మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మంగళవారం ఏలూరు రైల్వే స్టేషన్ పరిధి పొట్టిపాడులో రైల్వే ట్రాక్ దాటుతున్న చిక్కవరపు లక్ష్మి (30)ని రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News August 20, 2025
విశాఖ నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ సూచన

ఇటీవల ఎన్నికైన జీవీఎంసీ స్థాయి సంఘం సభ్యులు మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కమిషనర్ సభ్యులను అభినందిస్తూ, నగరంలోని ప్రతి అభివృద్ధి పనిపై స్థాయి సంఘంలో సమగ్రంగా చర్చించి ఆమోదం తెలుపడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని అన్నారు. నగర అభివృద్ధిలో సంఘం కీలక పాత్ర పోషించాలని సూచించారు.
News August 20, 2025
HYD: ‘పి.వి.రమణ గొప్ప అధ్యాపకుడు’

పి.వి.రమణ గొప్ప అధ్యాపకుడని, విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన లేనిచో ప్రాయోగిక అంశాల పట్ల పట్టు ఉండదని అనేమార్లు చెప్పేవారని తెలుగు వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు అన్నారు. మంగళవారం తెలుగు వర్శిటీలో డా.పి.వి.రమణ స్మారక పురస్కార ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. రంగస్థల కళల శాఖాధిపతి డా.బిహెచ్. పద్మప్రియ సమన్వయకర్తగా వ్యవహరించారు. దర్శకులు బి.ఎం.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News August 20, 2025
కొందుర్గు: కలెక్టర్‌కు లేఖ రాసిన విద్యార్థులు

కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్, డీఈఓకు లేఖ రాశారు. తమ పాఠశాలలో పనిచేస్తున్న సుష్మ అనే టీచర్ గండిపేట పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారని, దీంతో తమ పాఠశాలలో శివారెడ్డి అనే టీచర్ ఒకరే ఉండడంతో చదువు బోధించడం ఇబ్బందిగా మారిందని, వెంటనే సుష్మ టీచర్‌ను తమ పాఠశాలకు పంపించాలని విద్యార్థులు కోరారు.