News August 19, 2025

యాదాద్రి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా నరోత్తం రెడ్డి

image

యాదాద్రి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా బీబీనగర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన గూడూరు నరోత్తం రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ మంగళవారం ప్రకటించారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర, జిల్లా నాయకులకు ధన్యవాదాలు నరోత్తం రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడతానని, రాబోయే స్థానిక ఎన్నికలలో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు.

Similar News

News August 20, 2025

ప్రియుడిని పెళ్లి చేసుకున్న ‘జేజమ్మ’

image

‘అరుంధతి’లో చిన్ననాటి జేజమ్మగా నటించిన దివ్య నగేశ్ పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ అజిత్ కుమార్‌తో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ అమ్మడు ఈ నెల 18న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. సింగం పులి, అపరిచితుడు చిత్రాల్లో దివ్య నటించారు. అరుంధతిలో నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు.

News August 20, 2025

పల్నాడు: 2nd ఛాన్స్.. నేటితో లాస్ట్

image

ఉచిత విద్యాహక్కు చట్టం-2009 కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ అదనపు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే మేలో ఒకసారి నోటిఫికేషన్ జారీ చేశారు.

News August 20, 2025

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

image

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.