News April 1, 2024
HYD: సామ రామ్మోహన్ రెడ్డికి కీలక పదవి
టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డికి కాంగ్రెస్.. కీలక పదవిని అప్పగించింది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవహారాల ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవిని అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 15, 2025
ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు, బెయిల్ వ్యవహారంపై ఇవాళ ఉదయం హైదరాబాద్ కోకాపేటలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
News January 14, 2025
HYD: నేడే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
AICC నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే సీఎం, మంత్రులు బస చేయనున్నారు. ఢిల్లీ నుంచే వారం రోజుల పాటు సింగపూర్, దావోస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో పర్యటించనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వెళ్లనున్నారు.
News January 14, 2025
HYDలో గణనీయంగా తగ్గిన విద్యుత్ వాడకం
సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెటూర్లకు తరలివెళ్లారు. దీంతో గృహాలతో పాటు కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. ఉత్పత్తులు, రోజువారి కార్యకలాపాలు నిలిచిపోవడంతో వినియోగం గణనీయంగా తగ్గింది. సోమవారం 2,500 మెగావాట్లకు పడిపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే 700 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారలు తెలిపారు.