News August 19, 2025

వైర్లు కట్.. కేబుల్ ఆపరేటర్ల ఆందోళన

image

హైదరాబాద్‌లోని TGSPDCL కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. రామంతాపూర్ ఘటనకు <<17452500>>కేబుల్<<>> వైర్లు కారణం కాదని, వాటిలో విద్యుత్ సరఫరా అవ్వదని తెలిపారు. వైర్లు తొలగిస్తే లక్షలమంది ఉపాధి కోల్పోతారని, వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్లు ఇబ్బంది పడతారని వెల్లడించారు. కేబుల్ వైర్లను కట్ చేయొద్దని డిమాండ్ చేశారు.

Similar News

News August 20, 2025

బీజేపీ సర్కార్‌పై సంజయ్ రౌత్ సెటైర్

image

కేంద్ర ప్రభుత్వంపై శివసేన లీడర్, ఎంపీ సంజయ్ రౌత్ Xలో సెటైర్ వేశారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో ఈడీ, సీబీఐ, ఐటీ డిపార్ట్‌మెంట్, ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్లుగా ఓ ఫొటోను పోస్ట్ చేశారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడుతుందని ప్రతిపక్షాలు గత కొంతకాలంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

News August 20, 2025

అట్లీ-అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ఎప్పుడంటే?

image

డైరెక్టర్ అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమవుతుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా షూట్ కోసం దీపికా పదుకొణె 100 రోజుల కాల్షీట్లు కేటాయించినట్లు పేర్కొన్నాయి. ఇందులో బన్ని ట్రిపుల్ రోల్‌లో నటిస్తారని, దీపిక వారియర్‌గా స్పెషల్ లుక్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2027లో విడుదలయ్యే అవకాశముంది.

News August 19, 2025

రేపు పార్లమెంట్‌లో J&K పునర్వ్యవస్థీకరణ బిల్లు!

image

జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు రేపు పార్లమెంట్‌లో జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టనుందని Republic TV తెలిపింది. హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టి చర్చ మొదలుపెడతారని పేర్కొంది. కాగా J&Kకు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై స్పందన తెలపాలని ఇటీవల కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.