News April 1, 2024
తిహార్ జైలులో సెల్ కేటాయింపు
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు తిహార్ జైలులో అధికారులు సెల్ కేటాయించారు. జైలు నంబర్ 2 కాంప్లెక్స్‌లో ఆయనకు సెల్ కేటాయించగా.. అందులో కేజ్రీవాల్ ఒక్కరే ఉండనున్నారు. ఇదివరకు ఈ సెల్‌లో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కొద్ది రోజుల క్రితం జైలు నంబర్ 5 కాంప్లెక్స్‌కి మార్చారు. ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మహిళా ఖైదీలు ఉండే జైలు నంబర్ 6 కాంప్లెక్స్‌లో ఉంచారు.
Similar News
News November 8, 2024
TGSRTC హోం డెలివరీ.. ధరలు ఇవే..
TG: ఆర్టీసీ GHMC పరిధిలో హోం డెలివరీ సర్వీస్‌ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. పార్సిల్స్ 1KG – ₹50, 5KG – ₹60, 10KG – ₹65, 20KG – ₹70, 30KG – ₹75, 30KGలకు పైనుంటే ₹75కు అదనంగా పైనున్న స్లాబ్‌ల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు 9030134242 లేదా 9030135252కి కాల్ చేయవచ్చు. GHMC పరిధిలో 31 ప్రాంతాల్లో ఈ సర్వీస్ ఉంటుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది.
News November 7, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ.. UAEలో భారత్ మ్యాచులు!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 హైబ్రిడ్ మోడల్‌లో జరిగే అవకాశం ఉందని PTI తెలిపింది. భారత్ తన మ్యాచులను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో ఆడనుందని పేర్కొంది. నవంబర్ 11న ఆ టోర్నీ షెడ్యూల్ అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. కాగా, తొలుత ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాకిస్థాన్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అక్కడికి వెళ్లేందుకు బీసీసీఐ నో చెప్పడంతో తాజాగా మార్పులు చేసినట్లు సమాచారం.
News November 7, 2024
సునీతా విలియమ్స్ ఆరోగ్యంగా ఉన్నారు: నాసా
సునీతా <<14549029>>విలియమ్స్<<>> ఆరోగ్యంగా ఉన్నట్టు నాసా స్పష్టత ఇచ్చింది. ISSలో ఉన్న వ్యోమగాములందరూ ఆరోగ్యంగా ఉన్నారని, వీరికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నాసా ప్రతినిధి జిమి రస్సెల్ తెలిపారు. ఫ్లైట్ సర్జన్లు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. అయితే కేలరీల లోటు వల్ల కొంచెం బరువు తగ్గడంతో సునీత బుగ్గలు లోపలికి అణిగినట్టు గుర్తించానని రస్సెల్ పేర్కొన్నారు.