News August 19, 2025
రామంతాపూర్ ఘటనపై HRC సీరియస్.. సుమోటోగా కేసు

HYD రామంతాపూర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్రలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడడం విషాదకరమని HRC వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై HRC సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసింది. ఘటనకు గల కారణం, అధికారుల నిర్లక్ష్యం, తక్షణ పరిష్కార చర్యలు, బాధితుల కుటుంబాలకు పరిహారం, భద్రతా చర్యలపై సెప్టెంబర్ 22వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని TGSPDCL సీఎండీకి ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News August 20, 2025
HYD: గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్: మంత్రి

గణేశ్ ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం HYD జూబ్లీహిల్స్ పరిధిలోని MCRHRDలో గణేశ్ ఉత్సవాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఎక్కడా సమస్యలు రాకుండా చూస్తామన్నారు. పోలీస్ బందోబస్తు ఉంటుందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News August 20, 2025
సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రికి ఓ స్పెషల్ ఆఫీసర్: హెల్త్ మినిస్టర్

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ట్రేషన్ పరంగా లోపాల నివారణకు గాను స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు. వైద్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఓపీ బ్లాక్, ఐవీఎఫ్ సెంటర్ తదితర విభాగాలను పరిశీలించారు. పలువురు పేషంట్లతో మాట్లాడారు. సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు రూ.5 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.
News August 19, 2025
HYD: వరుసగా వర్షాలు.. నగరంలో మురుగు పరుగులు

వరుసగా వర్షాలు కురుస్తుండడంతో గ్రేటర్ HYDలో మురుగు పరుగులు పెడుతోంది. దీంతో పాదచారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్, మాదన్నపేట, బాలానగర్‌లోని రాజీవ్ గాంధీనగర్, గచ్చిబౌలిలోని ఓఆర్ఆర్ ఎక్స్ రోడ్, కొండాపూర్‌లోని కేఎంఆర్ ఎస్టేట్ వద్ద, బేగంపేటలోని వసంతనగర్, పాటిగడ్డ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలతో స్థానికులు సతమతమవుతున్నారు.