News August 19, 2025

ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

image

HYDలో ప్రియుడితో కలిసి భర్తను భార్య హతమార్చింది. అల్లాపూర్‌ రాజీవ్‌గాంధీ నగర్‌లో షాదుల్-తబ్‌సుమ్ దంపతులు నివాసముంటున్నారు. 4ఏళ్ల క్రితం తబ్‌సుమ్‌కు తాఫిక్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి భర్త మందలించాడు. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని AUG 15న షాదుల్ పడుకున్నప్పుడు ఇద్దరూ కలిసి కొట్టి, దిండుతో ముక్కు, నోరు మూసి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.

Similar News

News August 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 20, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 20, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.45 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.00 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.46 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.39 గంటలకు
✒ ఇష: రాత్రి 7.54 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 20, 2025

ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన విజయవాడ సన్‌షైనర్స్

image

APLలో భాగంగా అమరావతి రాయల్స్‌తో జరిగిన మ్యాచులో విజయవాడ సన్‌షైనర్స్ ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. తుంగభద్ర వారియర్స్, అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరాయి. తొలుత అమరావతి 19.5 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. విజయవాడ బౌలర్ సుమిత్ 4 వికెట్లతో సత్తా చాటారు. విజయవాడ 13.1 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. కెప్టెన్ అశ్విన్ హెబ్బర్ (82) రాణించారు.