News August 19, 2025

సాదియా బేగానికి బంగారు పతకం

image

పరిగి నియోజక‌వర్గానికి చెందిన డీఎస్టీవో నసీరుద్దీన్ పెద్ద కుమార్తె సాదియా బేగానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ ఇంగ్లిష్‌లో 2023- 24 ఓయూ టాపర్‌గా నిలిచింది. మంగళవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ఈమె పదో తరగతి పరిగి గొంసలొ గార్సియా ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివి వికారాబాద్ జిల్లా టాపర్‌గా నిలిచింది.

Similar News

News August 20, 2025

EPFOలో 230 ఉద్యోగాలు.. గడువు పెంపు

image

EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు గడువును పొడిగించారు. ఈనెల 18తో అప్లికేషన్ తేదీ ముగియగా 22 వరకు పెంచుతూ UPSC నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై, 35 ఏళ్లలోపు ఉండాలి. లెవెల్-8, లెవెల్-10 వేతన శ్రేణి కింద జీతాలు అందుతాయి.
వెబ్‌సైట్: <>upsconline.nic.in<<>>

News August 20, 2025

అందరి సహకారంతో మాదకద్రవ్యాల నిర్మూలన: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలో మత్తుమందుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మత్తుమందుల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత మత్తుమందులకు బానిస కాకుండా అన్ని స్థాయిలలో అవగాహన కల్పించాలని అన్నారు.

News August 20, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వాహనాల వేగాన్ని నియంత్రించడం, రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరగకుండా స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయడం, మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.