News August 19, 2025

రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నిర్మల్‌లో రేపు కూడా కుండపోత వానలు ఉన్నందున్న అధికారులు అలర్ట్ అయ్యారు. బుధవారం స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అభిలాష ఉత్తర్వులిచ్చారు. విద్యార్థుల రవాణా, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అటు కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

Similar News

News August 20, 2025

ప్రియుడిని పెళ్లి చేసుకున్న ‘జేజమ్మ’

image

‘అరుంధతి’లో చిన్ననాటి జేజమ్మగా నటించిన దివ్య నగేశ్ పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ అజిత్ కుమార్‌తో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ అమ్మడు ఈ నెల 18న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. సింగం పులి, అపరిచితుడు చిత్రాల్లో దివ్య నటించారు. అరుంధతిలో నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు.

News August 20, 2025

పెన్షన్లు.. వారికి మరో అవకాశం

image

AP: పెన్షన్‌కు <<17398848>>అనర్హులుగా<<>> నోటీసులు అందుకున్న దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. తాము పెన్షన్‌కు అర్హులమని భావించే వారు వెంటనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు. అర్హుల గుర్తింపులో అక్రమాలు జరిగాయని, నోటీసులు అందుకున్నవారు సదరం శిబిరాల్లో మరోసారి వైకల్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

News August 20, 2025

ఆ బిల్లు ఆపండి: అమిత్‌ షాకు AIGF లేఖ

image

బెట్టింగ్‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం తెచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ <<17459059>>బిల్లును<<>> ఆపాలని హోంమంత్రి అమిత్ షాకు ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్(AIGF) లేఖ రాసింది. దీని వల్ల గేమింగ్ సెక్టార్‌‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. కోట్లాది మంది గేమర్లు ఇల్లీగల్ గ్యాంబ్లర్లుగా మారే ప్రమాదముందని తెలిపింది. ఒకేసారి బ్యాన్ చేయకుండా క్రమంగా నియంత్రించాలని సూచించింది. కాగా దేశంలో గేమింగ్ సెక్టార్ విలువ ₹2లక్షల కోట్లు.