News April 1, 2024
పాలకొండ: చెరువులో పడి వ్యక్తి గల్లంతు

పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కోనేరులో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్నానం కోసం వెళ్లిన మింది ప్రభాస్(18) గల్లంతయినట్లు పాలకొండ అగ్నిమాపక అధికారి జె.సర్వేశ్వరరావు తెలిపారు. కోనేరులో ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువు గట్టుపై సదరు ప్రభాస్ బట్టలు ఉన్నాయని వాటిని తండ్రి లక్ష్మణరావు గుర్తించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 20, 2026
‘అర్జీలను సత్వరం పరిష్కరించాలి’: శ్రీకాకుళం కలెక్టర్

దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌ను కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమశాఖ, ఏడీబీ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌లో 7 దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News March 20, 2026
శ్రీకాకుళం జిల్లాలో యువకుడి హత్య.!

శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మోహన్ అనే వ్యక్తి గత రాత్రి హత్యకు గురయ్యారు. హత్య చేసిన వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలో మోహన్ తండ్రి ఇదే పార్టీ కార్యాలయంలో పనిచేసేవారు. అతని స్థానంలో మోహన్‌ను ఇటీవల నియమించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 20, 2026
ఎచ్చెర్ల: 5 నోటిఫికేషన్లు.. నియామకాలు నిల్.!

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఐదు సార్లు ఫ్యాకల్టీ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. నియామకాలు మాత్రం చేపట్టలేదు. 2013లో 34, 2014లో 15, 2017లో 48, 2018లో 32, 2023లో 98 పోస్టులకు నోటిఫికేషన్లు వేశారు. కొన్నిసార్లు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయినా నియామకాల మాత్రం జరగలేదు. ప్రస్తుతం రెగ్యులర్ ఫ్యాకల్టీ సభ్యులు ఏడుగురు మాత్రమే విశ్వవిద్యాలయంలో ఉన్నారు.


