News August 19, 2025

రైళ్లలో లగేజ్ వెయిట్ రూల్స్.. త్వరలో అమలు!

image

రైల్వే శాఖ ఎయిర్‌పోర్ట్ తరహా లగేజ్ వెయిట్ రూల్స్‌ను త్వరలో తీసుకురానుంది. ఫస్ట్ AC కంపార్ట్‌మెంట్‌లో 70కేజీలు, సెకండ్ AC 50 KG, థర్డ్ AC/స్లీపర్ 40 KG, జనరల్/2S 35 KG వరకు తీసుకెళ్లొచ్చు. పరిమితికి మించి తీసుకెళ్లాలంటే ముందే బుకింగ్ చేసుకోవాలి. లేదంటే జరిమానా విధిస్తారు. సైజు విషయంలోనూ పరిమితులుంటాయి. ఈ రూల్స్ తొలుత నార్తర్న్, నార్తర్న్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఎంపిక చేసిన 11 స్టేషన్లలో అమలవుతాయి.

Similar News

News August 20, 2025

పాఠ్య పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’

image

NCERT కీలక నిర్ణయం తీసుకుంది. 3-12వ తరగతి విద్యార్థుల పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని చేర్చింది. ఇందుకు సంబంధించి తాజాగా స్పెషల్ మాడ్యూళ్లు రిలీజ్ చేసింది. 3-8వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ సాగా ఆఫ్ వాల్యూర్(ఒక శౌర్య గాథ)’, 9-12వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ మిషన్ ఆఫ్ హానర్ అండ్ బ్రేవరీ(ఒక గౌరవం&ధైర్యసాహసాలు)’ టైటిళ్లతో పాఠ్యాంశాలను తీసుకువచ్చింది. పహల్గామ్ అటాక్‌ ఇందులో పొందుపర్చింది.

News August 20, 2025

ఆగస్టు 20: చరిత్రలో ఈ రోజు

image

1828: బ్రహ్మసమాజాన్ని స్థాపించిన రాజా రామమోహనరాయ్
1931: తెలుగు దివంగత హాస్యనటుడు పద్మనాభం జననం
1944: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(ఫొటోలో)జననం
1946: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి జననం
1977: వాయేజర్-2 వ్యోమనౌకను లాంఛ్ చేసిన నాసా
1995: హీరోయిన్ కావ్య ధాపర్ జననం
* మలేరియా నివారణ దినోత్సవం
* అక్షయ్ ఉర్జా దినోత్సవం

News August 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.