News August 19, 2025
HYD: డాక్టరేట్ పట్టా పొందిన ఎమ్మెల్సీ దయాకర్

ఉస్మానియా విశ్వవిద్యాలయం 84వ స్నాతకోత్సవం ఈరోజు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓయూ ఛాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణ్, వీసీ కుమార్ మొగులం చేతుల మీదుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన మాట్లాడుతూ.. గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Similar News
News August 20, 2025
HYD: విగ్రహాల తరలింపులో ఈ జాగ్రత్తలు పాటించాలి

వినాయక విగ్రహాల తరలింపులో ప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీటిని తప్పకుండా పాలించాలని సూచించారు.
☞ విగ్రహాల ఎత్తును బట్టి రూట్‌ను ఎంచుకోవాలి.
☞ విద్యుత్‌లైన్ల నుంచి కనీసం 2 అడుగుల దూరం పాటించాలి.
☞ క్రేన్లు, ట్రక్కులు, మెటల్ విగ్రహాల తరలింపులో అప్రమత్తత.
☞ మండపాలకు కరెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
☞ మండపాల్లో కరెంట్ పనులు చేసేటప్పుడు పరిసరాలను పరిశీలించాలి.
News August 20, 2025
HYDలో 24Hrs బస్సులకు పాజిటివ్ రెస్పాన్స్

HYDలో <<17459238>>24Hrs బస్సులు<<>> నడపాలని పలువురు కోరడంతో ఉదయం Way2News వార్త పబ్లిష్ చేసింది. దీనికి మెజార్టీ ప్రజలు సానుకూలంగా స్పందించారు. లాస్ లేకుండా కొన్ని రూట్లలో నడపొచ్చని, ఉ.4 నుంచి రాత్రి ఒంటి గంటవరకు, మధ్యతరగతి ప్రజలకు ఆర్టీసీ సేవలు అవసరమని, పటాన్‌చెరు- సికింద్రాబాద్ నైట్ టైమ్ బస్సులు కావాలని, కనీసం గంటకో బస్ అయినా.. అంటూ కామెంట్లు వచ్చాయి. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలని పలువురు కోరారు.
News August 20, 2025
‘జూబ్లీహిల్స్ టికెట్ నాదే.. లేదు నాది..!’

త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రతీ డివిజన్‌లో సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని కీలక నేతలు తమకే టికెట్ అన్నట్లు ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి రేసులో అంజన్ కుమార్ యాదవ్, ఆజారుద్దీన్, నవీన్‌యాదవ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు నేతలు ఢిల్లీ పెద్దలను కలిస్తున్నారు.