News August 19, 2025
HYD: డాక్టరేట్ పట్టా పొందిన ఎమ్మెల్సీ దయాకర్

ఉస్మానియా విశ్వవిద్యాలయం 84వ స్నాతకోత్సవం ఈరోజు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓయూ ఛాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణ్, వీసీ కుమార్ మొగులం చేతుల మీదుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన మాట్లాడుతూ.. గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Similar News
News August 20, 2025
పోడు భూముల్లో ప్రకృతి వ్యవసాయం

పాచిపెంట మండలం కుడుమూరు ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల్లో పకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పంట పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. సుమారు 15 పంచాయతీలు ప్రజలు పోడు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొండలపై తుప్పలు తొలిగించి వ్యవసాయం చేస్తుంటారు. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు వరి పైరు మొత్తం పచ్చగా మారి ఆ ప్రాంతం అరకును తలపిస్తోంది.
News August 20, 2025
‘జూబ్లీహిల్స్ టికెట్ నాదే.. లేదు నాది..!’

త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రతీ డివిజన్‌లో సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని కీలక నేతలు తమకే టికెట్ అన్నట్లు ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి రేసులో అంజన్ కుమార్ యాదవ్, ఆజారుద్దీన్, నవీన్‌యాదవ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు నేతలు ఢిల్లీ పెద్దలను కలిస్తున్నారు
News August 20, 2025
ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తాం: FRO

గండీడ్ మండలంలో ఓ వ్యక్తిపై నిన్న చిరుత పిల్ల దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ‘Way2News’ మహమ్మదాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మహమ్మద్ అబ్దుల్ హైను సంప్రదించింది. దీంతో అధికారి మాట్లాడుతూ.. చిరుతనా? కాదా పరిశీలిస్తామన్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి తెలుసుకుంటామన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.